కరోన కట్టడిలో మేము సైతం అంటూన్న యువత
కరోనా కట్టడి లో మేము సైతం అంటున్నారు పాత మేఘవరం గ్రామానికి చెందిన యూత్ ఆఫ్ పాతమేఘవరం సేవా సంఘo సభ్యులు.
వివరాల్లోకి వెళ్తే యూత్ ఆఫ్ పాత మేఘవరం సేవా సంఘం అధ్యక్షుడు సూరాడ రాజు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న యువకులు శ్రమదానంచేశారు.
గ్రామాల్లో కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాతమేఘవరం గ్రామంలో యువత అందరూ కలిసి వీధులను, రోడ్లను, మురుగు కాలవలను శుభ్రం చేశారు.
వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి ,శానిటేషన్ చేశారు. ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళితప్పుడు తప్పనిసరిగా మాస్క్ దరిoచాలని , భౌతిక దూరం పాటిoచాలని గ్రామంలోని ప్రజలకు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో సూరాడ యర్రయ్య, మంకు తేజ, హరిక్రిష్ణ, కామేష్, అమ్మోరు, మోహన్, రాజు, వసంత్, యువత పాల్గొన్నారు.
