ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని యువతి మృతి
తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం
ఆలమూరు మండలంలోని పెద్దపల్ల ఆర్&బి రోడ్డు పై బస్ ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే రావులపాలెం గ్రామానికి చెందిన వేపూరి జ్యోతి(26) ద్విచక్రవాహనంపై మండపేట వైపు ప్రయాణిస్తున్నరు.
ఈ క్రమంలో పెద్దపల్ల ఆర్&బి రోడ్డుపై మురళీకృష్ణ రైస్ మిల్ సమీపానికి వచ్చేసరికి వాకాడకు చెందిన ప్రయివేటు ట్రావెల్ బస్ ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఆలమూరు ఇంచార్జ్ ఎస్ఐ దొర రాజు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు