పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు
ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సి డి పి ఓ గారికి సిపిఎం పార్టీ తరపున వినతి పత్రం అందించడం జరిగింది
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారు కాలనీలలో ఉన్నటువంటి గర్భవతులకు, బాలింతలకు, కిశోర బాలికలకు, చిన్న పిల్లలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని తెలిపారు.
అవసరమైతే ఐసిడిఎస్ అధికారులు ఆయా కాలనీలల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి బాలింతలు, గర్భవతులు, చిన్న పిలలు, కిశోరబాలికల సమాచారాన్ని సేకరించి వారికి తప్పకుండా ప్రతి నెల పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా తమ కొర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణం నందు గల ఐ సి డి ఎస్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో గంటపాటు ధర్నా నిర్వహించి అనంతరం సి డి పి ఓ గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి B.మల్లికార్జున మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్‌లో విజృంభిస్తున్న సందర్భంగా పాఠశాలకు ఏ విధంగా అయితే ప్రభుత్వం సెలవులు ప్రకటించిందో, అదే తరహాలో అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా పట్టణంలో ప్రస్తుతం కేవలం 10 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, తద్వారా ఈ 10 అంగన్వాడి కేంద్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే పౌష్టిక ఆహారం అందుతోందని అన్నారు.
కావున పట్టణంలో అదనంగా మరో 20 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు చొరవ చూపాలని కోరారు.
అదేవిధంగా కరోనా తగ్గుముఖం పట్టే వరకు బాలింతలకు గర్భవతులకు చిన్న పిల్లలకు కిశోర బాలికలకు ప్రతి నెల ఇంటి వద్దకే పౌష్టికాహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బంగిశివ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు సిపిఎం నాయకులు శంకర్ రమేష్ అంజి మధు తదితరులు పాల్గొన్నారు.