కరోనా నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టాలి
వద్ద విజయనగరం జిల్లా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ధ పౌరవేదిక ఆధ్వర్యంలో జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి నిరసన దీక్ష చేపట్టారు.
ఈ దీక్ష సందర్భంగా ఆయన ప్రధానంగా చేసిన డిమాండ్లు
1)జిల్లా లో అర్జెంట్ గా అక్షిజన్ అందించే వెయ్యి పడకలు బెడ్లు తాత్కాలికంగా ఏర్పాటుచేయాలి.
2) జిల్లా ప్రజల మృత్యుఘోష వినిపించుకోవాలి.
3)రేమిడిసర్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచుతూనే, ప్రైవేటు ఆసుపత్రులకి అక్షిజన్ తగినంత సరఫరా చేయాలి.
4)అర్జెంట్ గా అక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి.
5) జిల్లాలోని పరిశ్రమల యజమానులను పిలిచి కరోనా బాధితులకు కావలసి సదుపాయాలు, అందించేందుకు ఏర్పాట్లు చెయ్యాలి.
6) మార్కెట్లో ని మందులు, వైద్య పరికరాలు అడ్డగోలు అమ్మకాలు అరికట్టాలని ప్రజల తరపున పాలకుల దృష్టి కి తీసుకువెళ్లే ప్రయత్నం చేసారు భీశెట్టి.
దీక్షకి మద్దతు పలికిన బీఎస్పీ నాయకులు రమణ గారికి, కరక వెంకటరమణ గారికి, ప్రజాసంఘాల నేతల కు విజయనగరం జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ధన్యవాదాలు తెలిపారు.