ధ్రిల్లర్ మాత్రమే కాదు! అంతకు మించి!!
వేమన పద్యంతో మొదలై వేమన పద్యంతో మలుపు తిరిగి వేమన పద్యంతో ముగిసే కథను పూర్తిగా కొత్త తారాగణంతో వైవిధ్యభరితంగా, సరికొత్త ప్రయోగాత్మక రీతిలో దర్శకత్రయం రూపొందించిన తాజా చిత్రం విశ్వదాభిరామ.
తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలిసారిగా ముగ్గురు దర్శకులు సంయుక్తంగా తెరకెక్కించిన విభిన్న చిత్రం ఇది.
ఆధ్యంతం సస్పెన్సుతో కొనసాగే ఈ చిత్రంలో చిత్రం శ్రీను ప్రతినాయక పోత్రను పోషించారు. ఒక్క ప్రతినాయక పాత్రలో తప్ప మిగిలిన పాత్రలన్నింటిలోనూ పూర్తిగా కొత్త తారాగణమే కనిపిస్తుంది.
అందూర కొత్త నటీనటులే ఆయినప్పటికీ ఎవరి పాత్రలలో వారు తమ తమ పాత్రలకు తగ్గట్టుగా మెప్పించే ప్రయత్నం చేశారు.
కధ విషయానికి వస్తే ట్రెజర్ హంట్ నేపధ్యంలో సాగే ఒక చక్కటి రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని చెప్పవచ్చు.
ముగ్గురు స్నేహితుల జీవితంలో సంభవించే ఒక సంఘటన ఎలా తమ జీవితాలను మలుపు తిప్పుతుందో, ఆ సంఘటన ఎలా తమను గేంషో పేరుతో ప్రమాదంలోకి నెట్టేస్తుందో అనే కథనంతో ఈ చిత్రం మనోరంజకంగా రూపుదిద్దుకుంది.
ప్రమాదాలను ఆ ముగ్గురు స్నేహితులు ఎలా ఎదుర్కున్నారు, ఆ ప్రమాదం నుండి ఎలా బయట పడ్డారు, ప్రతినాయకుడినుండి ఎలా తప్పించుకున్నారు, ఆ నిధిని ఎలా తమ సొంతం చేసుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకేవలసిందే.
ఈ చిత్రం ఒటీటీ ప్లాట్ఫాం ద్వారా ఈ రోజో ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరాభిమానాలను అందుకుంటుంది.
ఈ చిత్ర నటీనటులు
చిత్రం శ్రీను,
కృష్ణమూర్తి,
పండు కాకర్ల,
అనిల్ పొన్నగంటి,
ఆనంద్ తాడాల,
మానస ,సహస్ర ,రోజా రెడ్డి,
స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్: సురేష్ కాశీ
కెమేరా: అజీమ్
సంగీతం: వెంకటేష్ .బి
ఎడిటర్: శివ వై ప్రసాద్
డైరెక్టర్స్: సురేష్ కాశీ, అశోక్, సురేంద్ర
ప్రొడ్యూసర్: క్రౌడ్ ఫండింగ్ (solostar Entertainments)
Releasing on OTT Airtelxtream, AMAZON international, Hungama