ఎటువంటి అనుమతులు లేని ఇసుక లారీ పట్టివేత..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్ర పరిధిలోని సత్తెనపల్లి నరసరావుపేట రహదారిలో మంగళవారం ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక లారీని సత్తెనపల్లి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ మారయ్య బాబు పట్టణ సిఐ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా మరయ్యా బాబు మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వెహికిల్ చెకింగ్ చేస్తుండగా ఎటువంటి అనుమతులు లేకుండా అశోక్ లేలాండ్ టిప్పర్ 18 టన్నుల ఇసుకతో వెళ్తూ ఉండగా పట్టుకోడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఇసుకను అక్రమంగా తరలించిన అక్రమ మద్యాన్ని విక్రయించిన తరలించిన నాటుసారా తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.