మండపేటలో మంగళవారం నుండి అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా బంద్..
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్ళకూరి గొల్లబాబు..
మండపేట: మండపేట పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించడం వలన కరోనాను నియంత్రించవచ్చని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్ళకూరి గొల్ల బాబు పేర్కొన్నారు.
కాళ్ళకూరి గొల్ల బాబు మీడియాతో మాట్లాడుతూ మండపేట పట్టణంలో కోవిడ్ కేసులు రోజురోజుకు విపరీతముగా పెరుగుతున్నందున ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేస్తున్నట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ట్రేడ్ లోని ప్రెసిడెంట్, సెక్రటరీల అభిప్రాయం తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఈ సమయంలో నిత్యవసర వస్తువు అయిన కిరాణాషాపులతోపాటు అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ చేయనున్నట్లు తెలిపారు.
