తిరుపతి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!
తిరుపతి: తిరుపతి ఉపఎన్నికపై అందరి దృష్టి పడింది. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ సాగుతోంది. గెలుపుపై అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ గంపెడాశతో ఎదురుచూస్తున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికపై ‘ఆరా’ అనే సంస్థ, ‘ఆత్మ సాక్షి’ అనే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. అయితే ఈ రెండు సంస్థలు వైసీపీకే ఎక్కువ శాతం ఓటు షేర్ అయిందని వెల్లడించాయి.
అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? వాస్తవానికి దగ్గరగానే ఫలితాలు ఉన్నాయా..? లేక ఆయా పార్టీల మెప్పు పొందడానికి, తీసుకున్న ఆర్థిక తాయిలాలకు కట్టుబడి ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారా..? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
తిరుపతి ఉప ఎన్నికపై ఆత్మ సాక్షి సర్వే
వైసీపీకి 6.6 నుంచి 6.7 లక్షల ఓట్లు
టీడీపీ – 3.5 లక్షల ఓట్లు
బీజేపీ – 85 నుంచి 87 వేల ఓట్లు
కాంగ్రెస్ 16 నుంచి 17 వేల ఓట్లు
ఇతరులు – 6,100 ఓట్లు
తిరుపతి ఉప ఎన్నికపై ఆరా ఎగ్జిట్‌పోల్స్ లో 65.85 శాతం ఓటు షేర్‌తో వైసీపీ ముందంజలో ఉండగా, టీడీపీ 23.10 శాతం, బీజేపీ 7.34 శాతం, ఇతరులు 3.71 శాతంగా ఉన్నాయి.