మరుగుజ్జు నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య ఈరోజు ఉదయం గుండె పోటు రావడంతో ఓ ప్రవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
4.33 నిమిషాలకు ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
రేపు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 500కుపైగా చిత్రాల్లో నటించిన పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య.
విఠలాచార్య అగ్గివీరుడు చిత్రంతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు.
దాసరి ప్రొత్సాహంతో తాతమనవడు చిత్రంలో కీలక పాత్రలో నటించారు పొట్టి వీరయ్య.
