జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్… అందుబాటులోకి తెచ్చిన సుప్రీం కోర్టు
కరోనా తీవ్రత దృష్ట్యా యాప్ జర్నలిస్టులకోసం యాప్ ను అందుబాటులోకి తెచ్చిన సుప్రీంకోర్టు, యాప్ ను ప్రారంభించిన సి.జె.ఐ జస్టిస్ ఎన్.వి రమణ.
జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ ల ఆధ్వర్యంలో ఈ యాప్ రూపకల్పన జరిగింది.
ఈ యాప్ ను కేవలం మూడు రోజుల్లోనే సుప్రీంకోర్టు సాంకేతిక బృందం రూపొందించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి తాము సిద్ధం అని సి.జె.ఐ ఎన్.వి రమణ తెలిపారు.
ఐతే, ఈ విషయమై సహ న్యాయమూర్తులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని, ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తామని సి.జె.ఐ. తెలిపారు.
జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయంటూ సి.జె.ఐ గతాన్ని ఙప్తికి తెచ్చుకుంటూ, ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు పడుతున్న బాధలు మాకు తెలుసునని సి.జె.ఐ అన్నారు.
కోర్టు కార్యకలాపాల కోసం ఇబ్బంది పడకూడదనే యాప్ రూపకల్పన చేసినట్లు, సుప్రీంకోర్టుకు, మీడియాకు వారధిగా ప్రత్యేక అధికారిని నియమిస్తామని సి.జె.ఐ ఎన్.వి.రమణ తెలిపారు.
అక్రిడిటేషన్ల మంజూరులో హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సి.జె.ఐ అన్నారు.