చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి:- శ్రీకాళహస్తీశ్వర స్వామివారి వార్షికబ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గంగాదేవి సమేత పరమేశ్వరుడు రావణుడు వాహనంపై, పార్వతీదేవి అమ్మవారు నెమలి వాహనంపై పట్టణ మాడ వీధులలో విహరించారు
ఆలయంలోని ఆలంకారమండపం నందు స్వామివారిని అమ్మవారిని వివిధ రకాల ప్రత్యేక పుష్పాలతో పట్టు వస్రాలతో సువర్ణ ఆభరణాలతో సర్వాంగసుందరంగా చక్కగా అలంకరించి పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం ఎదుట స్వామివారిని రావణుడు వాహనంపై శ్రీ పార్వతిదేవి అమ్మవారిని నెమలి వాహనంపై కొలువుదీర్చారు
తదనంతరం స్వామి అమ్మవార్లకు దూప దీప కర్పూరహారతులు పట్టి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో కోలాటాల నృత్యాల నడుమ అంగరంగవైభవంగా నాలుగు మాడావిదులలో ఉరేగించారు
భక్తులు స్వామి అమ్మవార్లకు అడుగడుగునా కర్పూరహారతులతో నీరాజనాలు పట్టారు ఆదిదంపతులను కనులారా చూసి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు