సీనియర్ జర్నలిస్టు, ఐజెయూ నాయకులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కోసూరి అమర్ నాథ్ ఆకాల మరణానికి నా సంతాపం.
మూడు దశబ్దాలకుపైగా జర్నలిస్టు నాయకుడిగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ఆయన నిరంతరం కృషి చేశారు. ఆయన మృతి జర్నలిస్ట్ యూనియన్లకు, తెలుగు జర్నలిస్టులకు తీరని లోటు.
జర్నలిస్టుల యూనియన్లకు సంబంధించి చట్టపరమైన అంశాలు అన్నింటిలో నిష్ణాతుడిగా ఉండి, ట్రిబ్యునల్స్ వాటి సిఫారసుల అమలు గురించి యాజమాన్యాల మధ్య వచ్చిన వివాదాలకు ఒక నిపుణుడిగా ఆయన విలువైన సలహాలు ఇచ్చేవారు.
అలాంటి అమర్ నాథ్ కరోనాకు బలవ్వడం దురదృష్టకరం. ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తూ . . అమర్ నాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేసారు టీయుడబ్ల్యూజె అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ.
కరోనాతో గత రెండు రోజులలోనే అదిలాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ సాయినాథ్, వేములవాడకు చెందిన జర్నలిస్ట్ బూర రమేష్, కరీంనగర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ పడకంటి రమేష్, విశాఖ పరవాడ రిపోర్టర్ సూర్యప్రకాశ్ దురదృష్టవశాత్తు మరణించారు.
వారందరికీ కూడా ఆయన నివాళులు అర్పించారు. జర్నలిస్టులు కరోనా తీవ్రత దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకుని కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.