ఎంపీని రమేశ్ ఆసుపత్రికి పంపించండి: హైకోర్టు
అమరావతి: ఎంపీ రఘు రామకృష్ణ రాజును తక్షణమే రమేశ్ ఆసుపత్రికి పంపించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఎంపీ రఘు రామకృష్ణ రాజు కేసులో వైద్య బృందం నివేదిక జిల్లా కోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు చేరింది.
రమేశ్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశం పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.
కస్టడీలో ఉండగా సీఐడీ అధికారి పిటిషనర్‌ను కలిశారని, ఇలా కలవడం చట్ట విరుద్ధమని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇప్పటికే రిమాండ్ విధిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఎంపీ రఘురామను తక్షణం రమేశ్ ఆసుపత్రికి పంపాలని ఆదేశించింది.