మండపేట:- ప్రజా సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లో ప్రవేశించిన తనను వార్డు ప్రజలంతా ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని మండపేట 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్ విజ్ఞప్తి చేసారు.
ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన అనంతరం సతీష్ నేరుగా వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సీటు ఆశించి భంగపడిన సవరపు సతీష్ ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
కాగా ఎన్నికల ప్రచారానికి ఆఖరి తేదీ దగ్గర పడుతుండటంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి వచ్చిన సతీష్ నేరుగా వార్డు ప్రచారంలో పాల్గొన్నారు.
స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో ఉన్న తనను ప్రజలంతా అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.
తన ఎన్నికల గుర్తు బీరువాపై ఓటు ముద్రను వేయాలని ప్రజలను అభ్యర్థించారు. సతీష్ ప్రచారానికి వార్డు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా ఓటు నీకే అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తాను ప్రజా సేవలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
అయితే రాజకీయ చదరంగంలో తనకు సీటు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు చెప్పారు.
తనను గెలిపిస్తే నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
సతీష్ ప్రచారంలో ఆయన సోదరుడు సవరపు చంద్రం, స్థానిక యువత పల్లేటి సతీష్, పలివెల చిట్టిబాబు, పలివెల సత్యనారాయణ, నవుండ్రు భీమరాజు, కాకాడ సతీష్, కాకాడ నూకరాజు, సవరపు సురేష్, సవరపు భద్రరావు, ఈతకోట మార్కు తదితరులు పాల్గొన్నారు.