ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు ఆధ్వర్యములో ఘనంగా పొట్టి శ్రీ రాముల వారి జయంతి వేడుకలు
ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు నేతృత్వంలో పొట్టి శ్రీరాములవారి 120వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భముగా ఒంగోలు సీతారామపురంలోని శ్రీ వాసవి విద్యానిధి ఆర్యవైశ్య బాలుర వసతి గృహ ఆవరణలో అమరజీవి పొట్టి శ్రీరాముల వారి విగ్రహాన్ని సభ్యులు పూలమాలాంకృతం చేశి, నివాళులు అర్పించి, జోహార్లు పలికారు.
త్యాగమూర్తి, నిస్వార్ధ రహితముగ తెలుగు మాట్లాడువారందరికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని, భాషాప్రయోక్త రాష్ట్రాలకై తమ ప్రాణాలపై ఇసుమంతైనా ధ్యాస లేక ఆమరణ నిరాహారదీక్షను చేశారు.
58రోజుల పాటు నిరాహారులై, మంచినీటిని సైతం త్యజించి తుదకు ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తియని ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం ఈ సందర్భముగా శ్లాంఘించారు.
ఎవరికోసం వారు ఆత్మార్పణ చేశారు? అనే చిన్న విషయాన్ని ప్రతివారూ గుర్తించగలిగితే వారి త్యాగానికి శిరసువంచి పాదాభివందనం చేస్తారని, మనం ఇప్పుడు వారిని తలంచకపోతే భవిష్యత్తులో మన పిల్లల పిల్లలకు ఇంతటి మహాత్ముల గురించి తెలియ చెప్పెవారు ఉండరని, కనుక కులమతాలకు అతీతంగా, నిస్వార్ధుడై, గాంధీజి శిష్యరికంలో అహింసా మార్గంలో పయనించిన అమృత మూర్తి పొట్టి శ్రీరాముల వారిని ఇలానైనా వారి జయంతి, వర్ధంతులకు వారిని స్మృతి పథంలో నిలుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎంతో ఉన్నతమైన ఆర్యవైశ్యుల కుటుంబంలో జన్మించిన మనం త్యాగమూర్తులైన వారు మన ఆర్యవైశ్యులైనందుకు మనందరం గర్వించాలి. ఊరికోసం, రాష్ట్రం కోసం, దేశంకోసం ఒక్కొక్కరు ఒక్కోవిధముగ తమజీవితాలను త్యాగం చేసిన మహాత్ములు స్వామి వివేకానంద, మహాత్మాగాంధీజి, పొట్టి శ్రీరాములు, వీరిందరిని అనుసరిస్తూ మనం ముందుకు సాగాలని ఈ సందర్భముగా విచ్చేసిన కొలిశెట్టి అంకమరావు మనవిచేశారు.
కార్యక్రమములో వాసవి విద్యానిధి కార్యదర్శి నూనె రామాంజనేయులు, ఎయిమ్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు శెనెగెపల్లి నాగాంజనేయులు, ధనిశెట్టి రాము, మద్దాలి శివప్రసాద్, మరియు కొలిశెట్టి అంకమ రావు, యం. కృష్ణ ప్రసాద్, కె. హేమచంద్ర, జి. హరీష్, కె. మణికుమార్, ఐ బాలసాయి, కె. వెంకటేశ్వర్లు, పివి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.