కరోనా కేసులు పెరుగుతున్న నేపద్యంలో సమ్మెలు, నిరసనలు,దర్నాలుకు అనుమతులు యివ్వబడవు అని పాలకొండ డిఎస్పీ శ్రావణి తెలియజేశారు.
ఈ విషయమై పత్రికా ప్రకటన విడుదల చేసిన డిఎస్పీ శ్రావణి సమస్యల పట్ల పోలీస్ వారికు వినతి పత్రం వచ్చి యివ్వవచ్చునని తెలిపారు.
సమ్మెలు, సమావేశాలు, దర్నాలు నిర్వహిస్తే ఉపేక్షంచేది లేదని, సెక్షన్ 30, 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని ఆమె తెలియజేశారు.
యిప్పటికే వివిద కార్యాక్రమాలకు విధులకు వెళ్ళిన నలుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్జారని ఆమె తిలిపారు.
పాలకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడినట్లు తెలిపారు.
పోలీస్ సిబ్బంది కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ప్రకటనలో సూచించారు.
కరోనా 2వ దశ వేగవంతంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అవసరమైతే తప్ప బైటకు ప్రజలు రావద్దని, మాస్క్ తప్పనిసరిగా దరించవలెనని, లేని పక్షంలో జరీమానాలు విదించబడునని ఈ ప్రకటన ద్వారా అమె తెలిపారు.