నైజీరీయా జాతీయ భద్రతా సలహాదారుకు కేంద్రమంత్రి జైశంకర్ స్వాగతం
న్యూ ఢిల్లీ:- ఈ రోజు భారత్ విచ్చేసిన నైజీరయా జాతీయ భద్రతా సలహాదారు బాబాగానా మొంగునో కు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎస్ జయశంకర్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బాబాగానా మొంగునో ను స్వాగతించడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని, ఇరు దేశాల మధ్య గల సత్ససంబంధాలు ఈ రాక ద్వారా మరింత బలపడతాయనీ జయశంకర్ తన ట్వటర్ హ్యాండిల్ ద్వారా పేర్కొన్నారు.
భారత నైజీరియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, భారత్ కు నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.
అంతేగాక, భారత్ నైజీరియాకు కోవిడ్-19 టీకా సరఫరా చేయడంలో చూపిన చొరవతో ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ తన వంతు సహకారాన్ని అందించింది.
‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం మార్చిలో భారత్ నైజీరియాకు మేడ్-ఇన్-ఇండియా టీకాను సరఫరా చేసింది.
కరోనా పై పోరులో భారత్ ముందువరుసలో ఉండి ఇప్పటికి దాదాపు 70 దేశాలకుపైగా వాణిజ్య పరంగానే గాక మానవతా దృష్టితో సైతం కోవిడ్-19 టీకాను సరఫరా చేసింది.