నేనున్నాను, మీ అమ్మకు ఏమీ కాదు, ధైర్యంగా ఉండు
అప్పుడు సమయం అర్థరాత్రి 3.30 గంటలు.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఫోన్ రింగవుతోంది.. ఉలిక్కిపడి లేచి ఫోన్ లిఫ్ట్ చేశారు..
‘ఒక పాప ఏడుస్తూ మాట్లాడుతోంది.. సార్.. మా అమ్మకి బాగా సీరియస్గా ఉంది. కరోనా సార్.. 3 రోజుల క్రితమే మా నాన్న కరోనాతో చనిపోయారు.
ఇప్పుడు మా అమ్మకి అస్సలు బాగోలేదు. నాకు చాలా భయంగా ఉంది సర్. ఏమీ చేయాలో తెలియడంలేదు. హెల్ప్ చేయండి సార్.. ప్లీజ్..’ అని ఏడుస్తోంది..
ఒక్కసారి నిద్రమత్తు వదిలి.. నేను చూసుకుంటానమ్మా.. మీ ఇంటి అడ్రస్ చెప్పు అని వివరాలు తెలుసుకున్నారు వంశీ. మీ అమ్మకి ఏం కాదు, నేనున్నాను, ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది.’ అని భరోసా ఇచ్చి ఫోన్ కట్ చేశారు.
ఆ పాప ఇంటికి వెంటనే తన ఆఫీసు సిబ్బందిని పంపించారు. ఈలోపు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బెడ్ మాట్లాడారు. పాప తల్లికి వెంటిలేటర్ అవసరం. ఆస్పత్రిలో చేర్పించి వెంటిలేటర్ చికిత్స అందేలా చూశారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని సొంత మనిషిలా ఏంకావాలో చూసుకున్నారు. 4 రోజులకు ఆమె మెల్లగా కోలుకుంది.
ఆ పాప హ్యాపీ.. కరోనా కాటుకు తండ్రిని కోల్పోయిన ఆ పసిపాప తల్లిని బ్రతికించుకోగలిగింది.. ఎమ్మెల్యే స్పందించకపోయి ఉంటే పాప అనాథ అయిపోయేది. ఎమ్మెల్యే వంశీమోహన్ చొరవతో ఆ అమ్మాయి జీవితం నిలబడింది.