గ్రీన్ ఆర్మీకి నేషనల్ అవార్డు ప్రధానం చేసిన మంత్రి సీదిరి
ఈరోజు కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రీన్ ఆర్మీకి నేషనల్ అవార్డు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదే సందర్బంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులను రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ
“మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఔత్సాహికులకు, ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, సంఘసేవకులు మరియు వివిధ రంగాల్లో ఉన్న వారంతా కలిసి గ్రీన్ ఆర్మీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ స్ధాపించడం ఆనందదాయకమైన అంశం అన్నారు.
ఈరోజు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.
గత సంవత్సర కాలంగా మన పలాస నియోజకవర్గం పరిధిలో ముఖ్యంగా ఈ కరోనా కష్ట సమయంలో విశేషమైన సేవలు అందివ్వడం జరిగిందని అన్నారు.
అన్నార్తులను ఆదుకోవడంలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో కానీ, పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో గానీ యువకులకు స్పూర్తినిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రీన్ ఆర్మీ ముందుకు వెళ్తుందని కొనియాడారు.
ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గ్రీన్ ఆర్మీ లో ఉన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపారు.
ఈసందర్భంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నని మంచి అవార్డు గ్రహీతలు వుంచుకున్న మన గ్రీన్ ఆర్మీ టీం కి నా హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో చేపట్టాలని, ఎల్ల వేళలా ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి తోపాటు పలాస మున్సిపాల్ చైర్మన్ బల్లా గిరిబాబు గారు, వైస్ చైర్మన్ బోర బుజ్జి గారు, ఏయం.సి చైర్మన్ పి.వి.సతీష్ గారు,మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్ర గారు,చీఫ్ విప్ మీసాల సురేష్ గారు, సురేంధ్రనాధ్ గౌరు త్యాఢీ గారు,గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్, ప్రధాన కార్యదర్శి బందాపు తిరుమల ఏ. మధుబాబు బి. ఓంకారం అమ్మా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.