కరోనాతో వైద్య విద్యార్థిని మృతి…
తూ.గో.జిల్లా ……రాజోలు …… సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో వైద్య విద్యార్థిని మృతి చెందింది.
MBBS ఫస్ట్ క్లాస్ లో పాసై ఏలూరు ఆశ్రమంలో కరోనా పేషెంట్ లకు సేవలు చేస్తున్న విద్యార్థిని, ఆ కరోనా కాటుకే బలయింది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమంలోనే MBBS చదివి అక్కడే కోవిడ్ పేషెంట్ లకు చికిత్స చేసే క్రమంలో అనారోగ్యానికి గురైన విద్యార్థిని…
స్వగ్రామం మోరి చేరుకుని నిన్న మోరి లోని సుబ్బమ్మ కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్ లో చేరిన విద్యార్థిని పరిస్థితి విషమించడంతో ఈరోజు సుబ్బమ్మ హాస్పిటల్ లో మృతి చెందింది.