కరోనా బాధితులకు మెడికల్ కిట్లు..
మండపేట: మండలంలోని ఇప్పనపాడు గ్రామానికి చెందిన నందవరపు రామారావు, సతీష్ లు సమకూర్చిన మెడికల్ కిట్లను సర్పంచ్ కుంచె వీరమణి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వర్మకు అందజేశారు.
ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఫీవర్ సర్వే పూర్తిచేసిన తరువాత అనుమానితలకు పరీక్షలు చేయించి కరోనా బాధితులకు మందులు అందజేయాలన్నారు.
బాధితులకు మరిన్ని సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్ మగ్గం రాంబాబు , వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.