స్వచ్ఛందంగా సంపూర్ణ లాక్ డౌన్ దిశగా మండపేట…
ఉదయం 8 నుండి 10 గంటల వరకే వ్యాపారాలు…
అన్ని వర్గాలు ఏకాభిప్రాయం…
అత్యవసర సేవలు మినహా మిగతా బంద్…
మండపేట:- మండపేటలో రోజురోజుకు కరోనా ముప్పేట దాడి పెరుగుతున్న క్రమంలో వ్యాపార వర్గాలు స్వచ్ఛంద లాక్ డౌన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
వివిధ రాజకీయ పక్షలు సైతం సంపూర్ణ బంద్ పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నెల 10 సోమవారం నుండి ఈ నెలాఖరు వరకు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించే యోచనలో ఉన్నారు ఆదివారం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకురి గొల్లబాబు ఇప్పటికీ వివిధ ట్రేడ్ ల నుండి దీనిపై అభిప్రాయలు సేకరించారు.
వైఎస్సార్ సిపి, కాంగ్రెస్, టిడిపి, బిజెపి, జేనసేన, సిఐటియు పార్టీ లు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని తద్వారా కేసులు సంఖ్య తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తున్నాయి.
ఇందుకు గాను ప్రజలు అధికారులకు పూర్తి సహాయ సహకారాన్ని అందించేందుకు సిద్ధం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో పాలు, కూరగాయలు, కిరాణా షాపులు కేవలం ఉదయం 8 నుండి 10 వరకే తెరచి మిగిలిన వేళల్లో మూసివేయాలని భావిస్తున్నారు.
మిగిలిన అన్ని ట్రేడ్ లు పూర్తి గా మూసివేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సర్వీసులు వైద్యం, మెడికల్ షాపులకు మినహాయింపు ఇవ్వనున్నారు.
అనవసరంగా బయటకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. ఇది సత్పలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.