గూడూరు లో దారుణం, భార్యను హత్య చేసిన భర్త
నెల్లూరు జిల్లా గూడూరులో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే హత్య చేసాడు ఓ కసాయి భర్త.
వేముల పాలెం సమీపంలోని సవక తోటలో భార్య సుజాతపై పెట్రోల్ పోసి హత్య చేసాడు ఆమె భర్త శ్రీహరి.
కుటుంబ కలహాల నేపథ్యంలో సుజాతను నిన్న రాత్రి శ్రీహరి హతమార్చినట్లు సమాచారం.
వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
