♦ భద్రతా బలగాలే టార్గెట్
♦ రెచ్చిపోతున్న మావోయిస్టులు
♦ పలు ప్రాంతాల్లో మావోయిస్టులు ఘాతుకం
ఛత్తీస్‌గఢ్ ఏజన్సీలో మావోయిస్టులు రెచ్చిపోయారు.
భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్ మృతి చెందినట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా బర్సూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాహుర్‌నార్ సమీపంలో ఇంద్రావతి నది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఈ పనుల వద్ద 22వ బెటాలియన్‌కు చెందిన జవాన్ లక్ష్మీకాంత్ ద్వివేది సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నాడు.
గురువారం లక్ష్మీకాంత్ సమీపంలోని ఓ చెట్ట కింద భోజనం చేసేందుకు వెళ్లాడు.
అక్కడ జవాన్ భోజనానికి కూర్చునేందుకు ప్రయత్నించగా, ఆ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజీవ్ డివైస్ (ఐఈడీ) భారీ విస్పోటనం చెంది ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
చెల్లా చెదురైన శరీర భాగాలు
ఈ ఘటన లో జవాన్ శరీర భాగాలు చెల్లాచెదురైపోయి మాంసపు ముద్దలుగా పడిపోయాయి.
ఇక ఈ విషయం తెలుసుకున్న తోటి జవాన్లు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
మృతి చెందిన లక్ష్మీకాంత్ మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనతో దంతేవాడ పోలీసు యంత్రాంగం అప్రమత్తమై మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.