నేడు 2020-21 విద్యాసంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.
10,88,439 మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా రూ. 671.45 కోట్లు జమ
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువుల చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతీ విద్యార్థికీ సకాలంలో, ఏ బకాయిలూ లేకుండా నాలుగు దఫాల్లో పూర్తి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ప్రారంభించారు.
ఇకపై ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
2020-21 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా నేడు 10,88,439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ. 671.45 కోట్లు వైయస్ జగన్ సర్కార్ జమ చేయనుంది.
అతి పెద్ద సామాజిక మార్పుకు నాందిగా ఈ జగనన్న విద్యా దీవెన పథకం నిలువనుంది.
గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 1,774.60 కోట్లతో కలిపి మొత్తం రూ.4,207.85 కోట్లు లబ్దిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేకూర్చినున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం లబ్బి రూ.4,879.30 కోట్లు.
గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.1774.60 కోట్లు చెల్లించిన వైయస్ జగన్ సర్కార్
గత ప్రభుత్వంలోలా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి పలికింది వైయస్ జగన్ సర్కార్.
నిన్నటికంటే ఈ రోజు బావుండాలి, ఈ రోజు కంటే రేపు ఇంకా బావుండాలి. అందరి జీవితాల్లో ఇలాంటి మార్పే లక్ష్యంతో వైయస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
పిల్లలు చదువుతున్న కాలేజీలకు తల్లిదండ్రులు స్వయంగా వెళ్ళి ఆ ఫీజులు కట్టడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు కాలేజీలో సమస్యలు, పరిస్థితులు, సదుపాయాలు, అక్కడ తమ పిల్లల బాగోగుల గురించి తెలుసుకుని, కాలేజీలో వసతుల లోపం, సమస్యలు ఏమైనా ఉంటే కాలేజీ యాజమాన్నాన్ని ప్రశ్నించగలుగుతారు.
కాలేజీలోని సమస్యలను 1902 నంబరుకు ఫోన్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ కాలేజీలో పరిస్థితులు చక్కదిద్ది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది.
కాలేజీల్లో జవాబుదారీతనం, కాలేజీల స్థితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది.
కుటుంబంలో ఉన్న అర్హులైన పిల్లలందరికీ ఉన్నత విద్య చదివే అవకాశం, తద్వారా అన్ని విధాల ఆ కుటుంబాలు స్థిరపడతాయి.
మీ ఖాతాలో డబ్బులు జమ అయిన వారం పది రోజులలో మీ కళాశాలలకు ఫీజు చెల్లించండి. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజును మీకు అందిన తరువాత కూడా కళాశాలకు చెల్లించకపోతే, తదుపరి విడత నిలుపదల చేసే అవకాశం ఉంది.