మద్దతు ధరకు ధాన్యం కొనాలి..
ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు..
మండపేట: రైతులు శ్రమపడి పండించిన ధాన్యానికి మద్ధతు ధర లేక రైతులు చాలా నష్టపోతున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులందరూ ఆందోళనలో ఉన్నారన్నారు.
బొండాలు రకం ధాన్యం ఎవరూ కొనడంలేదని పేర్కొన్నారు. మధ్దతు ధర కన్నా బాగా తగ్గించి అడుగుతున్నారని వాపోయారు.
వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద పేరుకు పోయిన బొండాలు రకం ధాన్యాన్ని మధ్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎఫ్ సి ఐ , సివిల్ సప్లై ను ఆదేశించాలని వేగుళ్ళ జోగేశ్వరరావు లేఖ ద్వారా జిల్లా కలెక్టర్ ను కోరారు.