జనగామ:- జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామంలోని ప్రాజెక్ట్ వల్ల తాటి ఈత వనం మునిగి భూములు కోల్పోయి నిర్వాసితులు అవుతున్నారని, వారికి 10 ఎకరాల భూమిని కేటాయించి తాటి చెట్టుకు 25 వెల నష్టపరిహారం ఇవ్వాలని ఆగ్రామ గీతకార్మికులు చేపట్టిన రిలే నిరసన దీక్షలు ఈ రోజుతో 4వ రోజుకు చేరుకున్నాయి.
ఈ దీక్షలకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల JAC రాష్ట్ర కమిటీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అద్వర్యంలో రిలే నిరహార దీక్షల శిబిరాన్ని అమరవేణి నర్సాగౌడ్ (మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్) మోకుదెబ్బ రాష్ట్ర సెక్రెటరీ జనరల్, గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రాగుల సిద్దిరాములు గౌడ్, తెలంగాణ గౌడ మహిళ రాష్ట్ర నాయకు రాళ్ళు ఇల్లసారపు మాధవి గౌడ్, పన్యాల మమత గౌడ్, మక్తల శైలజ గౌడ్, నాయిని నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సమస్యలపై మాట్లాడి రిలే నిరాహారదీక్షకు మద్దతు తెలిపి రూ: 5000-/- నగదుగా వారికి అందచేసి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడాలని పిలుపునిస్తూ, పోరాటాలకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో దాదాపు 200 గీత కార్మికులు, మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.