కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అర్థాకలితో ఎవరూ ఇబ్బంది పడొద్దు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ సిబ్బందికి నేటి నుండి సాయం.
UDISE లో నమోదైన 1,13,850 మందికి రూ.2000 నగతుతో పాటు 13715 రేషన్ షాపుల ద్వారా 3000 మెట్రిక్ టన్నుల బిపిటి బియ్యం పంపిణి.
కరీంనగర్లో పథకాన్ని ప్రారంభించిన పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్
కరోనా సంక్షోభంతో ప్రపంచం, భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల ప్రజలు, ఉద్యోగులని వారి మానాన వారిని వదిలేసి చేతులెత్తేస్తే, కేవలం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రోద్బలంతో సంక్షేమాన్ని కొనసాగించడమే కాక మానవతా ద్రుక్పథంతో మరింత సాయం చేస్తుందని తెలియజేశారు మంత్రి గంగుల కమలాకర్.
ప్రైవేట్ టీచర్లు, స్కూళ్ల సిబ్బందికి పాఠశాలలు పునఃప్రారంబించే వరకూ అందజేయాలని నిర్ణయించిన 2000 రూపాయలు, 25 కేజీల సన్నభియ్యం సరఫరాను మంత్రి ఈ రోజు లాంఛనంగా కరీంనగర్లో ప్రారంభించి లబ్దీ దారులకు అందజేశారు.
కరోనా విలయతాండవంతో అర్థాకలి, ఆకలితో భాదపడుతున్న ప్రజలు, ప్రైవేట్ ఉద్యోగుల్ని కేసీఆర్ సర్కార్ మానవతా ద్రుక్పథంతో సహాయం చేస్తుందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిల్లో ఇబ్బందులు ఉన్నా, ఏ హైకోర్టు, ఇతర సంఘాలు డిమాండ్ చేయకున్నా మెదటి కరోనా సంక్షోబంలో ఒక్కొక్కరికి 12కిలోల ఉచిత బియ్యంతో పాటు కుటుంబానికి 1500 రూపాయలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుత సెకండ్ వేవ్‌లో సైతం ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన ఉద్యోగుల్ని సన్న భియ్యం ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1లక్షా 45వేల మంది ఉద్యోగులుగా అంచనా వేసిన ప్రకారం ఇప్పటివరకూ యూడైస్ (UDISE – Unified Data Information of School Education) లో ఎన్రోల్ చేసుకున్న 1లక్షా13వేల 850 మంది సిబ్బందికి అకౌంట్లలో 2000 చొప్పున జమచేశామని, వారందరికీ నేటి నుండి 13715 రేషన్ షాపుల ద్వారా నాలుగురోజుల పాటు దాదాపు 11 కోట్ల విలువగల 3000మె.టన్నుల బిపిటీ రకం సన్న భియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.
యూడైస్‌లో లేని విద్యాసంస్థల సిబ్బంది సైతం సాయం కోసం విజ్ణప్తి చేస్తున్నారని వారికి కూడా సాయం అందజేయడానికి కసరత్తు చేస్తున్నామన్నారు.
డాటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ చివరి వ్యక్తి వరకూ సాయం అందేలా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల్ని పాటిస్తామని చెప్పారు మంత్రి.
ప్రతీ ప్రైవేట్ టీచర్, సిబ్బంది ఆత్మగౌరవంతో బ్రతికేలా స్కూళ్లు ప్రారంబమయ్యేవరకూ ఈ సాయం కొనసాగుతుందని అభయం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ 3027 మంది ఉద్యోగుల్ని గుర్తించి 2000 అందజేసామని 441 రేషన్ షాపుల ద్వారా 76 మెట్రిక్ టన్నుల బిపిటీ బియ్యం అందిస్తున్నామన్నారు గంగుల.