తిరుపతి పార్లమెంటు స్థానానికి నాగార్జునసాగర్ శాశనసభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమీషన్.
మార్చి 23 న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 30 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. మార్చి 31 న స్క్రుటినీ జరుగగా, ఏప్రిల్ 3 వరకు నామినేషన్లఉప సంహరణ గడువు ఇవ్వనున్నారు.
ఏప్రిల్ 17 న రెండు స్థానాల్లోను పోలింగ్ నిర్వహించి మే 2 న కౌంటింగ్ నిర్వహించి ఫలితాల ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.
ఇక రెండు రాష్ట్రాల్లోను సంవత్సర కాలంగా ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న గ్రామ పంచాయితీ ఎన్నికలు, నిన్న మునిసిపాలిటి ఎన్నికలు అంటూ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కగా తెలంగాణలో సైతం దుబ్బాక మొదలుకుని హైదరాబాద్ బల్దియా ఆ తరువాత యంఏల్సీ ఎన్నికలు ఇలా ఏదో ఒక ఎన్నికల ప్రక్రియు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక తిరుపతి పార్లమెంటు స్థానానికి టిడిపి తరఫున పనబాక లక్ష్మి బరిలో నిలువనున్నట్లు ఇప్పటికే ఆ పార్టి ప్రకటించగా వైసిపి తమ అభ్యర్ధి ఎవరనేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
జనసేన బిజేపీ కూటమిలో తిరుపతి పార్లమెంటు స్థానం బిజేపీకే వదిలేస్తున్నట్లు జనసేన అధినేత ప్రకటించిన విషయం తెలిసిందే, అయితే గడిచిన కొద్ది రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆశించని మేర లేకపోవడానికి కారణం బిజేపి తో పొత్తో అని జనసేన నేతలు బాహాటంగానే ప్రకటించిన నేపధ్యం జనసేన నాయకత్వం తమ మాటకే కట్టుబడి ఉంటుందా లేక పార్టి శ్రేయస్సు కోరి తమ నిర్ణయం మార్చుకోనుందా అనే అంశం వేచి చూడాల్సిందే.