సిబ్బంది కోసం త్రాగునీరు సదుపాయం ఏర్పాటు చేసిన ఎస్.ఐ ప్రసాద్
పాలకొండ: కర్ఫ్యూ నేపద్యంలో పాలకొండ నగర పంచాయతీలో ప్రజలు అనవసరంగా తిరగకుండా వాహనాలు రాకపోకలు నిలవరించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎస్. ఐ సి. హెచ్ ప్రసాద్ త్రాగునీరు సదుపాయం ఏర్పాటు చేశారు.
వేసవి ఎండల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి త్రాగునీరు అందించడం వారికి కొంతమేర ఉపశమనం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.