మూడు నెలల్లో 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు
పీఎం కేర్స్ నిధులతో నెలకొల్పనున్న డీఆర్డీఓ
దేశంలో ఆక్సీజన్ కొరతను తీర్చడానికి విమానాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ (ఎంఓపి) టెక్నాలజీ ఉపయోగపడనున్నారు.
ఎల్‌సిఎ తేజస్ కోసం దీనిని డిఆర్డిఓ, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లాబొరేటరీ (డెబెల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఈ ప్లాంట్ నిమిషానికి 1,000 లీటర్ల (ఎల్పిఎం) ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఈ వ్యవస్థ 190 మంది రోగులకు 5 ఎల్పిఎం రేటుతో ఆక్సిజన్ ను అందించి మరియు రోజుకు 195 సిలిండర్లను ఛార్జ్ చేయగలుగుతుంది.
ఈ ప్లాంట్లను నెలకొల్పో సాంకేతికతను ఇప్పటికే బెంగళూరు లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, మరియు కోయంబత్తూర్ లోని ట్రైడెంట్ న్యూమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లకు అందించడం జరిగింది.
ఈ రెండు సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో నెలకొల్పడానికి 380 ప్లాంట్లను తయారు చేస్తాయి.
సిఎస్ఐఆర్కు చెందిన డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంతో కలిసి ఈ సంస్థలు 500 ఎల్పిఎం సామర్థ్యం గల 120 ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయి.
కోవిడ్ – 19 రోగుల చికిత్స కోసం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు మరియు ఆసుపత్రులలో ఆక్సిజన్ చాలా ముఖ్యమైన క్లినికల్ గ్యాస్ గా అవసరముంటుంది.
మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ (ఎంఓపి) టెక్నాలజీ 93 (± 3)% నిష్పత్తితో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
దీనిని నేరుగా ఆసుపత్రి పడకలకు సరఫరా చేయవచ్చు లేదా మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను నింపడానికి ఉపయోగించవచ్చును.
ఇది వాతావరణంలోని గాలి నుండి నేరుగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పిఎస్ఎ) టెక్నిక్ మరియు మాలిక్యులర్ సీవ్ (జియోలైట్) సాంకేతికతను ఉపయోగిస్తుంది.
పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులలో కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ సాంకేతికత ఉపయోగపడుతుంది.
తమ అవసరాల కోసం ఆసుపత్రులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరాల కోసం ఎదురు చూడకుండా తమ ఆవరణలోనే తక్కువ ఖర్చుతో సైట్ మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకోగలుగుతాయి.
ఈ ప్లాంట్ ను నెలకొల్పడం ద్వారా ఎత్తయిన మరియు మారుమూల ప్రాంతాలలో కొరతగా ఉండే ఆక్సిజన్ సిలిండర్లపై ఆసుపత్రి ఆధారపడటాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
ఈశాన్య, లేహ్-లడఖ్ ప్రాంతంలోని కొన్ని సైనిక ప్రాంతాల్లో ఇప్పటికే మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ పనిచేస్తున్నవి.
ఈ ప్లాంట్ ఐస్ఓ1008, యూరోపియన్, యుఎస్ మరియు ఇండియన్ ఫార్మాకోపియా వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
ప్లాంటులను ఏర్పాటు చేయడానికి న్యూ ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతంలో అయిదు ప్రాంతాలను గుర్తించడం జరిగింది.
380 మెడికల్ ఆక్సిజన్ ప్లాంటులను నెలకొల్పాలని నిర్ణయించిన డిఆర్డిఓ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బెంగళూరుకు 332, ట్రైడెంట్ న్యూమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 48 ఆర్డర్లను ఇచ్చింది.
పిఎం కేర్స్ నిధులతో నెలకు 125 ప్లాంట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో మూడు నెలల్లో 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.
కోవిడ్ -19 రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న డిఆర్డిఓ ను అభినందించిన రక్షణశాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఇది ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడుతుందని అన్నారు.
ఆస్పత్రులు మరియు ఇతర ఆరోగ్య సంస్థలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి డిఆర్డిఓ అవసరమైన సహకారాన్ని అందిస్తుందని రక్షణ శాఖ ఆర్‌అండ్‌డి కార్యదర్శి, డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు.