వ్యాక్సీన్లు ఇవ్వలేకపోతే ఉరేసుకోవాలా? కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్ కొరతపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి డీవీ సదానందగౌడ తీవ్ర స్థాయిలో స్పందించారు.
కోర్టులు ఆదేశించిన పరిమాణంలో వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయలేకపోతే పాలకులు ఉరేసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.
‘‘దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ అందాలని కోర్టు చెప్పడం మంచి ఆలోచనే. అయితే రేపు అదే కోర్టు పలానా సంఖ్యలో వ్యాక్సీన్లు ఇవ్వాలంటూ చెబితే అన్ని వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయలేనందుకు మేము ఉరేసుకోవాలా?…’’
అని మంత్రి ఆక్రోశం వెళ్లగక్కారు ఇవాళ బెంగళూరులో జరిగిన ఓ మీడియా సమావేశంలో వ్యాక్సీన్ కొరతపై వచ్చిన ప్రశ్నలకు స్పందిస్తూ సదానంద ఈ మేరకు స్పందించారు