టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు – సీ ఎం జగన్
అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం నేను ఆలోచిస్తానని సి ఎం జగన్ స్పష్టం చేసారు.
విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదని ఆయన గుర్తు చేశారు.
పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని, కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు.
మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుంది కాబట్టి టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటున్నామని స్పష్టం చేసారు.
కోవిడ్‌పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ, టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్కే నష్టం అని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరని తెలుపుతూ, పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్ అని ఇస్తే.. భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారని అన్నారు.
పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మరో సారి స్పష్టం చేశారు.