కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
మండపేట :- కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మున్సిపల్, అంగన్వాడీ, ఆశ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు అంగన్వాడి ఆశ సంఘాలు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ సమాన పనికి, సమాన వేతనం చెల్లించాలన్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
కరోనాలో ప్రాణ రక్షణకు, రక్షణ పరికరాలు, మెరుగైన వైద్యం అందించాలన్నారు. నూతన విద్యావిధానం రద్దు చేయాలన్నారు.
ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు కార్మిక కోడ్ లు , వ్యవసాయ నల్లచట్టాలను తక్షణం రద్దు చేయాలన్నారు.
తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ సంఘాల నాయకులు రాణి, దేవి, నరేంద్ర, కొండ, సరస్వతి, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.