పలమనేరు మండలంలో యువకుడు దారుణ హత్య..
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో దారుణం చోటు చేసుకుంది, ప్రేమ వ్యవహారంలో ప్రేమికుడిని ముక్కలుగా నరికి పూడ్చిపెట్టిన ఘటన పెంగరగుంట గ్రామంలో వెలుగుచూసింది.
పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే నిన్న పెంగరగుంట గ్రామంలో ధనశేఖర్ హత్యకు గురయ్యాడు.
విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులే ధన శేఖర్ ను హత్య చేసారని ఆరోపిస్తూ ధనశేఖర్ కుటుంబ సభ్యులు నిన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంగరగుంట గ్రామంలో ముక్కలు ముక్కలుగా నరికిన ధనశేఖర్ మృతదేహాన్ని బయటకు తీసారు.
తదుపరి సమాచారానకై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.