పలాస మండలంలో కలకలం రేపుతున్న క్షుద్రపూజలు
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తర్లాకోట గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువు గర్భంలో ఉపాధిహామీ పథకం పనుల్లో భాగంగా తవ్విన గుంతల్లో అర్ధరాత్రి సమయంలో జరిపిన క్షుద్రపూజలు.
ఈ క్షుద్రపూజలుకు భయంతో ఉపాధిహామీ పథకం పనులు నిలిపివేసిన కూలీలు. గత నాలుగు రోజులుగా కూలీలు నీడ కోసం వేసుకున్న టెంట్ ను ధ్వంసం చేసి, మద్యం సీసాలను తవ్విన గుంతల్లో పగలుగొట్టారు.
ఉపాధిహామీ పథకం పనులు చేసుందుకు తర్లాకోట పేదలు భయపడుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడుతున్న వారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.