యువత రక్తదానం చేయండి..
భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి..
మండపేట: కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రస్థాయిలో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండపేట నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కోన సత్యనారాయణ పేర్కొన్నారు.
బ్లడ్ బ్యాంకులలో రక్తపు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని అందువలన స్వచ్ఛంద సేవా సంస్థలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మూడు నెలల వరకు రక్తదానం చేయకూడదని అందువలన యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు.
రక్తం అవసరమైన గర్భిణీలు, రోడ్డు ప్రమాదాల బారినపడిన వారికి బ్లడ్ అవసరం అయితే ఇబ్బంది లేకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు.