బెంగాల్ ప్రభుత్వ దౌర్జన్యాలు దారుణం..బిజెపి ఆధ్వర్యంలో నిరసన..
మండపేట: బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తలపై, మహిళలపై దాడులు చాలా దారుణమని మండపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోన సత్యనారాయణ పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం బుధవారం మండపేట పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం బిజెపి బలపడుతుందని తృణమూల్ కాంగ్రెస్ భయటపడుతుందని అన్నారు.
గతంలో 3 సీట్లతో ఉన్న బిజెపి ఈసారి ఎన్నికలలో 80 శాసనసభ స్థానాలు సాధించడం తృణమూల్ కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.
నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓడిపోవడంతో తట్టుకోలేని కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పైన మహిళలపైన భౌతిక దాడులకు దిగుతున్నారని అన్నారు.
భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంతటి ధారుణాలు ఎప్పుడూ జరగలేదని, వెంటనే ప్రజలకు, రక్షణ కల్పించి సీబీఐతో దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ వైస్ ప్రెసిడెంట్ నాళం ఫణిప్రకాష్, వై.విజయ, జక్కా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.