జర్నలిస్టుల కష్టాల పై స్పందించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
జిల్లా జర్నలిస్టుల కోసం 225 రెమిడెసివిర్ ఇంజక్షన్లు
.. ఉచితంగా అందజేత
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జర్నలిస్టులను తమ వంతు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
కరోనా పాజిటివ్ గురై ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులకు రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఉచితంగా అందించనున్నారు. జర్నలిస్టుల కోసం 225 ఇంజెక్షన్లను సిద్ధం చేసారు.
ఇవాళ నెల్లూరు నగరంలో ఒక శాటిలైట్ ఛానల్ కెమెరామెన్ అత్యవసరంగా ఆరు రెమిడిసివేర్ ఇంజెక్షన్లు అవసరం అవడంతో మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయం వెంటనే స్పందించి వాటిని అందజేశారు
ఆత్మకూరుకి వెళ్లి అభిరామ్ హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఒక ఇంజెక్షన్ బయట అత్యవసరమైతే 30 వేల రూపాయలు పెట్టి కొన్న ఆ కెమెరామెన్ కు మిగిలిన అయిదు ఇంజక్షన్లు కొనుగోలు చేయడం కష్టతరంగా మారింది.
మంత్రి మేకపాటి కార్యాలయాన్ని సంప్రదించగానే వెంటనే వారు స్పందించారు మంత్రి మేకపాటి దాతృత్వం మంచి మనసుతో ఉచితంగా అందుకోవడంతో జర్నలిస్ట్ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా జర్నలిస్టులను గుర్తు పెట్టుకుని వారు కష్టకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కార్యాలయ సిబ్బందికి పదేపదే వారిని కాస్త గమనించండి అంటూ తన సందేశాన్ని పంపారు…
మేకపాటి అడుగుజాడల్లో మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా నడవాలని జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కోరుకుంటున్నారు.
#remdesivir