ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం
కోవిడ్ నియంత్రణ చర్యలపై కౌంటర్ దాఖలు చేయకపోవటంపై సీరియస్
గత సెప్టెంబర్ లో తోట సురేష్ బాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
కరోనా సెకండ్ వేవ్ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకలు, మందుల అంశంపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకున్నారు
రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని హైకోర్టుకు తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్
ఈ నెల 27 లోగా అఫిడవిట్ దాఖలు చేయకపోతే ప్రభుత్వంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందన్న ధర్మాసనం