కరోనా పాజిటివ్ కేసులు గానీ, మృతులను కానీ దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలియజేశారు.
దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లలో వివరాలు అందుబాటులో ఉంచుతున్నాం అని ఆయన తెలియజేశారు.
ప్రతి మరణాన్ని సమీక్షిస్తున్నాం.
ఎక్కడా దీనిపై దాయాల్సిన పనిలేదు
ఆక్సిజన్ పైప్‌లైన్‌తో కూడుకున్నవి 26,000 పడకలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నది 2 వేల మంది మాత్రమే అని ఆయన అన్నారు.
రోజుకు 347 కిలోలీటర్ల ఆక్సిజన్ అవసరం ఉండగా 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది అని ఆయన గుర్తు చేసారు.