తాడేపల్లి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడు అన్నారు.
కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శప్రాయుడని, పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రోజని తెలియజేసారు.
ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రజలందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.