తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన 1998 డిఎస్పీ క్యాలిఫైడ్ ఉపాధ్యాయులు
60 మంది ఉపాద్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…
సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ ప్రాతిపదికన కల్పించాలని డిమాండ్ చేస్తుూ 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు సీయం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా తాము అన్యాయంకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.
గత ప్రభుత్వ హయాంలో పలు రకాల జీవోలు ఇచ్చి గందరగోళానికి గురి చేసి చేసారని జగన్ ప్రభుత్వమైన తమ గోడు వినిపించుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
జివో 221 వల్ల నష్టపోయామని, వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో గుర్తించిన 3300 మంది అభ్యర్థులకు ఇంతవరకు న్యాయం జరగలేదని వారు వాపోయారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకుని ఉపాధ్యాయులను మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.