హైదరాబాద్ చేరుకున్న 1.50 లక్షల డోసుల స్పుత్నిక్-వీ
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మొదటి విడత ఇటీవలే హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
అక్కడి నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు వాటిని తరలించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోన్న ఈ వ్యాక్సిన్ రెంవడ విడత నేడు హైదరాబాద్ చేరింది.
మొత్తం 1.50 లక్షల డోసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చరగా అక్కడికి నుంచి వీటిని రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు.
భారత దేశానికి రష్యా నుంచి మొత్తం 67 లక్షల డోసులు చేరుకోనున్నాయి. వాటిల్లో భాగంగానే విడతల వారీగా స్పుత్నిక్-వీ వస్తోంది.
అంతేగాక, వచ్చే నెల నుంచి దేశంలోనే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది.
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ఒక్కో డోస్ ధర రూ.995గా ఉండనున్నట్లు ఇప్పటికే రెడ్డిస్ ల్యాబ్ పేర్కొంది. దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమయ్యాక దాని ధర తగ్గనుంది.